There may be a paradigmatic shift in the educational system due to Covid-19 pandemic.


Most of the students studying in government schools are belong to Below Poverty Line

Actually,there are 220 days in an academic calendar year. There might be 100 working days in this upcoming academic calendar year. For remaining 100 days the student has to stay at home and attend the online classes. Remaining 20 day they have to attend counselling.The students might have to attend the school on alternative days.The actual length of a subject period is 45 minutes, now it might be reduced to 30 minutes. Due to Covid-19 pandemic There may be so many changes in education system from upcoming academic year . The central government is proposing to introduce all thesue changes in the educational system

Officials from Ministry of Human Resource and Development informed that there is no change in total number of working days in an academic calendar year. They informed that the students have to attend the school on alternative days. They also informed that an action plan has been worked out as all students get their online education in alternative working days.The government also focused on burdenless evaluation system.

The union government proposed all managements to run the school with less than fifty percentage of students. They prepared proposals so that students of 1 to 5 classes can attend the school 2 times in a week, the students of 6 to 8 classes can attend the school 2-4 times in a week, and the students of 9-12 classes can attend the school 4-5 times in a week.The government proposed all managements to admit migrant labour children in schools.It also proposed don’t demand for transfer certificate at the time of their admission. Central government has been focused on the child friendly evaluation system. It also also concentrated on upcoming hurdle during implementing all these strategies.

The government proposed all schools to maintain social distancing measures, Sanitizers, thermal screening equipment and proper precautionary measurements to face Covid-19 pandemic. Shortly the government is going to issue all these guidelines. By observing all these things I can conclude that there may be a paradigmatic shift in education system.

Source; Andhra Jyothi news and wattsap


Stay home Stay safe

గీతాంజలి-3

My dearest soulmates, Good morning to all. I am very rejoiced to present my translation of the third poem from the book, Gitanjali.

I know not how thou singest, my master! I ever listen in silent amazement. 

ప్రభూ, నీవెట్లా పాడతావో నాకెఱుక. నిబిడాశ్చర్యంతో నీ గానాన్ని వింటూంటాను.

The light of thy music illumines the world. The life breath of thy music runs from sky to sky.

నీ రాగ-జ్ఞానం జగతిని ప్రజ్వలింపజేయును. నీ సంగీత ఉచ్ఛ్వాస-నిశ్వాసములు నభోంతరాళమందు తిరుగాడును.

The holy stream of thy music breaks through all stony obstacles and rushes on.

నీ పవిత్ర గాన ప్రవాహం, శిలాసదృశ విఘ్నములను భంగపరిచి ముందుకురుకును.

My heart longs to join in thy song, but vainly struggles for a voice.

నీ గానంలో లీనమవ్వాలని నా హృదయ కాంక్ష, గొంతులేక వృధాగా ప్రయాస పడుతోంది.

I would speak, but speech breaks not into song, and I cry out baffled.

నాకు మాటలు చేతనౌను, ఆ మాట పాటకాలేక భంగపడి రోదిస్తాను.

Ah, thou hast made my heart captive in the endless meshes of thy music, my master!

అయ్యో! ప్రభువా! తుదిలేని నీ సంగీత జాలికలలో నా హృదయాన్ని బంధించావు!

I will meet you all on my new blog shortly. Thank you all.

గీతాంజలి-2

Good morning friends, I am overjoyed to present my translation of the second poem from the book, Gitanjali. Here is my translation.

When thou commandest me to sing it seems that my heart would break with pride; and I look to thy face, and tears come to my eyes. 

నీవు నన్ను పాడమని ఆజ్ఞాపించినప్పుడు,
గర్వంతో నా ఎడద భగ్నమౌనేమోననిపించింది.
నీ ముఖారవిందం గాంచి, నా నేత్ర యుగళం కన్నీటి సంద్రమైంది.

All that is harsh and dissonant in my life melts into one sweet harmony—and my adoration spreads wings like a glad bird on its flight across the sea.

నా జీవితాన కాఠిన్యం, వైరుధ్యమంతయు కరిగి ఓ తీయని పొందికై- నా ఆరాధన, సాగరాన తేలియాడు స్వేచ్చా విహంగ పక్షములై విచ్చుకుంది.

I know thou takest pleasure in my singing. I know that only as a singer I come before thy presence.

నా ఆలాపన నీకానందమని నాకెఱుక. కేవలం ఓ గాయకునిగా నీ సమక్షానికొచ్చానని నాకెఱుక.

I touch by the edge of the far-spreading wing of my song thy feet which I could never aspire to reach.

నేనెన్నటికి చేరశక్యముగాని నీ పాదపద్మములను, అల్లంత దూరాలకు పర్యాప్తమౌ నా గానపు రెక్కల అంచుతో తాకుతాను.

Drunk with the joy of singing I forget myself and call thee friend who art my lord.

గానానందపు మైకంలో నన్ను నేను మైమరచి, నా ప్రభువైన నిన్ను "స్నేహితుడని" సంభోదిస్తాను.

I hope, you have enjoyed a lot. Thanks for your valuable time. Shortly, I will meet you all on my new blog

గీతాంజలి-1

It has been a long time to meet you all on my blog page. Because of my busy schedule, I am unable to share anything on my blog with you. Today I’m delighted to meet you all on my blog page.

I have been thinking about the translation of famous Indian Nobel laureate, universal teacher, Rabindranadh Tagore’s Gitanjali poems for a long time. I have already translated around 60 poems. Each poem is unique and novel. We can feel its novelty in each poem. For the first time, I am going to post these translations on my blog. Before going to dive into the topic, let’s learn about Ravindranath Tagore and his writings.

Ravindranath Tagore was a Bengali poet and a philosopher, he published Gitanjali on 4th August 1910 in Bengali language. It comprises 153 Bengali poems. Later, he published his English translation of Bengali Gitanjali with the title of Gitanjali:Song offering in November 1912. The English translation comprises 103 poems. Among those 103 poems, 53 poems from the original Gitanjali and other 50 poems from his other writings. He became a Nobel laureate in 1913 for his book Gitanjali. He was the first Indian Nobel laureate in the category of literature. Furthermore, he is also the first Asian and the first non-European Nobel laureate in the category of literature. “Geetha” means song and “Anjali” means offering / offering of the prayer, i.e., Gitanjali means song offering.

Each poem in this masterpiece portrayed the feelings of love and the individual conflict between the desire of earthly possessions and spiritual longings vividly.

These are all my free translations of the Poems. Please read them carefully and send me your valuable feedback to enrich my translations.

Here is my translation for first poem of Rabindranath Tagore’s Gitanjali.

గీతాంజలి-1

(Thou hast made me endless, such is thy pleasure. This frail vessel thou emptiest again and again, and fillest it ever with fresh life.)

నన్ను చిరస్మరణీయుణ్ణి చేశావు, నీ చిత్తమట్టిది. ఈ పెలుసు పాత్రను పదేపదే ఖాళీ చేస్తూ, మరలా క్రొంగొత్త శ్వాసతో నింపుతూ ఉంటావు.


(This little flute of a reed thou hast carried over hills and dales, and hast breathed through it melodies eternally new.)

ఈ చిరు రెల్లు మురళిని కొండ కోనలలో తిప్పుతూ, నిత్య నూతన మోహన రాగాలను పలికిస్తూ ఉంటావు.

(At the immortal touch of thy hands my little heart loses its limits in joy and gives birth to utterance ineffable. )

నీ దైవ స్పర్శతో నా చిరు డెందము హర్షాతిరేకమున అదుపుతప్పి, అవ్యక్త వేదమంత్రోచ్ఛారణైంది.

(Thy infinite gifts come to me only on these very small hands of mine. Ages pass, and still thou pourest, and still there is room to fill.)

నీ అమోఘమైన కాన్కలు నా ఈ చిట్టి చేతుల మీదుగా వచ్చి చేరతాయి. కాలం గడిచే కొద్దీ నువ్వు గుమ్మరిస్తూనే ఉంటావు, అయినప్పటికీ నేను అసంపూర్ణుడినే.


The song of the Rain

Good day my dear friends. It’s a wonderful day to meet all of you on this digital platform. I have started to translate some poems of English literature. Today I am going to present one of them.

The song of the Rain

I am dotted silver threads dropped from heaven by the gods. Nature then takes me, to adorn her fields and valleys.

I am beautiful pearls,Plucked from the crown of Ishtar by the daughter of Dawn to embellish the gardens.

When I cry the hills laugh;
When I humble myself the flowers rejoice;
When I bow, all things are elated.

The field and the cloud are lovers
And between them I am a messenger of mercy.
I quench the thirst of one;
I cure the ailment of the other.

The voice of thunder declares my arrival;
The rainbow announces my departure.
I am like earthly life, Which begins at the feet of the mad elements And ends under the upraised wings of death.

I emerge from the heart of the sea,Soar with the breeze.When I see a field in need, I descend and embrace the flowers and the trees in a million ways.

I touch gently at the windows with my soft fingers, And my announcement is a welcome song. all can hear, But only the sensitive can understand

The heat in the air gives birth to me,But in turn I kill it, As woman overcomes man with the strength she takes from him.

I am the sigh of the sea;
The laughter of the field;
The tears of heaven.

So with love –
Sighs from the deep sea of affection;
Laughter from the colourful field of the spirit;
Tears from the endless heaven of memories.

వర్ష గీతిక

సురలచే జారవిడువబడ్డ 
రజిత హారాన్ని నేను,
ప్రకృతిమాత నన్ను స్వీకరించి తన
కొండ,కోన,మైదానాలకు సింగాస్తుంది.

తన వనాలను శృంగారించుటకు గాను,
ఉదయ సంధ్య తనుజ చే,
ఇష్తారు* మకుటం నుండి త్రుంపబడిన
మేలిమి ముత్యమును నేను.

నా రోదనతో నగములు నవ్వును,
నా నమ్రతకు విరులు విరియును,
నా నమతకు ప్రకృతి ఉప్పొంగును.

నింగి-నేలయను వలపు జంటకు,
దౌత్యము నెరుపు దయగల దూతికను నేను,
ఒకరికి ప్రేమ దాహాన్ని తీరుస్తాను,
మరొకరికి ప్రేమ గాయాలను మాన్పుతాను.

ఉరుము గర్జనతో నా రాకడను ఎరుకచేస్తే,
సప్తవర్ణ హరివిల్లు నా నిష్క్రమణను ఎరుకజెప్పును,
భౌతికాంశముల పదముల వద్ద మొదలై
మృత్యువు రెక్కల కింద ముగిసే లౌకిక జీవనం
లాంటిది నా నిత్య జీవన యానం.

సంద్రము గుండెన పుట్టి,
చలి గాడుపున తేలియాడి,
పసరిక బయళ్లను నే గాంచినపుడు,
ప్రయాత* విధములుగా నేను,
తరులు, విరులను కావలిస్తాను.

మునివేళ్లతో సుతిమెత్తగా గవాక్షాన్ని తాకుతాను,
నా రాకడ నీకొక స్వాగత గీతం
జనులెల్లరూ నా గీతాన్ని వింటారు,
సున్నితులకు మాత్రమే అవగతమవుతుంది.

గాడ్పున పుట్టే ఉష్ణము నాకు పుట్టుకనిచ్చును,
తనకు శక్తినిచ్చిన పురుషుని జయించిన
సబల రీతిన నేను ఉష్ణమును చంపుదును.

అగాథ సంద్రపు నిట్టూర్పు నేను,
పసిరిక బయళ్ళ పకపక నగవును నేను,
దివము వర్షించే ఆశ్రువులను నేను,

ప్రేమతో కాబట్టే,
ఈ అనురాగ సంద్రపు నిట్టూర్పులు,
ఈ రంగుల ప్రపంచ స్ఫూర్తుల నవ్వులు,
ఈ అనంతాకాశపు జ్ఞాపకాల కన్నీరు.

(*ఇష్తారు= బాబిలోనియన్ల శృంగార మరియు యుద్ధ దేవత.)
(*ప్రయాత= పది లక్షలు=ఒక మిలియన్)

( Khalil Gibran చే విరచితమైన “song of the Rain” అనే పద్యానికి “వర్ష గీతి” అనే పేరున నా స్వేచ్చానువాదం…
My dear friends it is my free translation only, there may be some corrections. I am expecting your valuable suggestions and criticism .
Yours loving friend
Nagalapalli.T.V.Gurumurthy)

వారపు సంత లో ఒక రోజు…

శుభోదయం మిత్రులారా, నేను మొన్న తే.9.జనవరి.2021.ది న బట్టల వ్యాపారి అయిన మా మామయ్య గారికి సాయంగా మా ఊరికి దాపున ఉన్న అచ్యుతాపురం శనివారపు సంతకి వెళ్ళాను. దాదాపుగా వందేళ్ల చరిత్ర ఉన్న ఈ సంతతో నా బాల్యం నుండి నాకు అనుబంధం ఉంది. ప్రస్తుత ఆధునిక యుగంలో, కార్పొరేట్ శక్తుల నీడన ఈ సంతలు తమ ప్రాబల్యాన్ని మరియు ఉనికిని క్రమంగా కోల్పోతున్నాయి. నేటి ఆధునిక వాణిజ్య సముదాయాలకు మాతృకలు ఈ సంతలు. అటువంటి సంతలు, వాటి ప్రాముఖ్యత మరియు ఇతర అంశాలను మీతో పంచుకోవాలని భావించి ఈ బ్లాగు రాస్తున్నాను.


శనివారం సంతలో మా మామయ్య గారి వస్త్రాదుకాణం లో నేను.

సంత – బార్టర్ పద్దతి (వస్తు మార్పిడి విధానం).

సంత అంటే ఒక పెద్ద అంగడి, వివిధ రకాల వ్యక్తులు ఏర్పాటు చేసిన వివిధ రకాల తాత్కాలిక దుకాణాల సముదాయం. ఈ సముదాయాలు నిర్దిష్ట వారపు రోజుల్లో ఏర్పాటు చేస్తారు. ప్రాచీనమైన వస్తుమార్పిడి పద్దతి వీటి  నుండి ఏర్పడి ఉండవచ్చు. దీనినే బార్టర్ పద్దతి అంటారు. ఈ వస్తుమార్పిడి పద్దతి ద్రవ్యం ఆవిర్భావానికి కొన్ని శతాబ్దాల ముందే ఈ పద్దతి వినియోగంలో ఉంది. ఈ వస్తు మార్పిడి పద్దతిలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు, వారి వద్ద గల వివిధ రకాల వస్తువులను లేదా సేవలను వారి అవసరాల మేరకు పరస్పరం మార్పిడి చేసుకుంటారు. క్రీ౹౹పూ౹౹6000 నాటికే మెసపటోమియా స్థానిక తెగల వారు ఈ పద్దతిని ఉపయోగించేవారు. తరువాత దీనిని ఫీనిషియన్స్ ఈ పద్దతిని వినియోగించారు. తర్వాత కాలంలో బాబిలోనియన్లు ఈ పద్దతిని మెరుగుపర్చారు. ఉదాహరణకు ఆ నాటి రోమ్ లో ఉప్పు ఖరీదైనది కావటం వలన సైనికులకు వారి సేవలకు ప్రతిఫలంగా ఉప్పును జీతంగా ఇచ్చేవారు. మధ్యయుగం నాటి యూరోపియన్లు నౌకాయానం ద్వారా ప్రపంచమంతా పర్యటిస్తూ బార్టర్ విధానం లో వ్యాపారం చేసేవారు. 1930 నాటి తీవ్ర ఆర్ధిక మాంద్యం కాలంలో సరిపడా ద్రవ్యనిల్వలు లేకపోవడంతో బార్టర్ పద్దతి చాలా ప్రాముఖ్యత పొందినది.

శనివారపు సంతలో ఒక వస్త్రదుకాణం

సంతలు- వాటి నిర్వహణ:

సాధారణంగా ఈ సంతలను పెద్ద గ్రామాలు లేదా పట్టణాలలో లేదా వాటి సమీప ప్రాంతంలో విశాలమైన స్థలంలో  ఏర్పాటు చేస్తారు. సంతను ఏర్పాటు చేయుటకు కావలసిన సదుపాయాలను (స్థలం, దుకాణాలు, విద్యుత్, త్రాగునీరు, వ్యాపారులు మరియు వారి వస్తువుల రక్షణ… మొదలైనవి) స్ధానిక ప్రభుత్వాలు (గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ… మొదలైనవి), యువజన సంఘాలు,స్థల యజమానులు మొదలైన వారు ఏర్పాటుచేస్తారు. ఈ సంతలలో కొన్ని ప్రభుత్వానికి, మరికొన్ని ప్రయివేటు వ్యక్తులకు చెందినవి. ప్రభుత్వానికి చెందిన సంతలపై గుత్తాధిపత్యం కొరకు ప్రభుత్వంవారు వేలంపాట నిర్వహించి,  వేలంపాటలో ఎక్కువ ధరకు సంత నిర్వహణాధికారాన్ని దక్కించుకున్న ప్రయివేటు వ్యక్తులకు ఈ సంతల నిర్వహణ భాధ్యతలను అప్పజెప్పుతారు. ఈ ప్రయివేటు వ్యక్తులు తమ సంతలలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు గాను కొంత మొత్తం లో రుసుమును వ్యాపారుల వద్ద నుండి సంత నిర్వాహకులు వసూలు చేస్తారు. ఈ రుసుమునే “ఆశీలు” అంటారు. వసూలు చేసే వ్యక్తులను “ఆశీల్దార్లు” అంటారు. ఈ ఆశీలు అనబడే సుంకాన్ని, సంతలో వ్యాపారం చేసుకునేందుకు అవసరం అయిన ప్రదేశం పై లేదా సంతలో విక్రయించేందుకు తీసుకువచ్చిన వస్తువులపై  విధిస్తారు.

నిమ్మలవలస గ్రామ వారపు సంతలో ఆ సంత పుట్టుకను (ప్రారంభ వివరాలను) తెలిపే శిలాశాసనం

అచ్యుతాపురం సంతలో వసూలు చేసే ఆశీలు వివరాలు.

  • తోక గల జంతువు (ఆవు,మేక,గొర్రె,గేదె,బఱ్ఱె)…..30.రూ.       
  • పక్షి (కోడి, బాతు…)…15 రూ.
  • కూరగాయల తట్ట……10 రూ.
  • అరటి గెల(1)………..  10 రూ.
  • వ్యాపారం చేసుకునేందుకు స్థలం…50-100 రూ. (అక్రమించే స్థలం ను అనుసరించి)

గమనిక: పై వివరాలు ఉజ్జయింపుగా చెప్పబడినవి, వీటి విలువ కాస్తా అటుఇటూ గా ఉండవచ్చు. పండగ దినాల యందు ఏర్పాటు చేసే పండగ సంతలలో ఈ రుసుముముల విలువ కాస్తా పెరుగుతుంది.

సంతలు-వ్యవసాయం

వ్యవసాయ ఉత్పత్తులను మార్పిడి చేసుకోవడానికి అమ్ముకోవడానికి రైతులకు సంతలు ప్రధాన మార్గాలు. రైతులు పంట పండించే పొలం సమీపంలో సంతలు ఉండటం వలన రైతులకు రవాణా ఖర్చులు పెద్దగా ఉండవు, తాజాగా పండించిన కూరగాయలను వెంటనే సంతకు చేర్చడం వలన తరుగు నష్టం తక్కువగా ఉంటుంది. సంతలోనే తన పంటను అమ్ముకుని లేదా మార్పిడిచేసుకుని తనకు అవసరం అయిన నిత్యావసర వస్తువులను తెచ్చుకోగలడు. సంతలు నేటి ఆధునిక కార్పోరేట్ వాణిజ్య సముదాయాలకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని రకాల వాణిజ్య వస్తువులు లేదా సేవలను అందించగలవు.

సంతలు-కులవృత్తులు

**************///*************

క. వెలకాంత లెందఱైననుఁ
  గులకాంతకు సాటిరారు కువలయమందున్
  బలువిద్య లెన్ని నేర్చినఁ
  గులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా

**************///*************

భావం: ఈ ధరణి పై వెలయాండ్రులు (వేశ్యలు) ఎంతమందైనను కులకాంత(భార్యకు)సాటిరారు. అదేవిధంగా జీవినోపాధికి ఎన్ని విద్యలను (వృత్తులను) నేర్చుకున్నా కులవృత్తిని (తాత-తండ్రుల నుండి నేర్చుకున్న వారసత్వ వృత్తి) మించిన వృత్తి లేదని కవి అర్ధం.

**************///*************

కులవృత్తి ప్రాశస్త్యాన్ని వివరించిన పై శతక పద్యము గువ్వల చెన్నడు చే విరచితమైన గువ్వల చెన్న శతకం లోనిది. కులవృత్తి అనేది వృత్తి (జీవనాధారము కొరకు చేసే పని) ని సూచిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు దానిని తప్పుగా అర్థం చేసుకోవడం వలన ఆ విభజన  సమాజములో వర్గాల, కులాల విభజనకు దోహదకారి అయి ఉండవచ్చు. అన్ని రకాల కులవృత్తుల వారిని ఈ సంతలు అక్కున చేర్చుకుని వారికి జీవనోపాధిని కల్పిస్తున్నాయి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేతపని, జాలరి, దర్జీ, వ్యవసాయదారులు, పశువుల పెంపకందార్లు, లోహకారులు, మేదరి, జాలరి, కసాయి, వర్తకం, చర్మకారులు,  ఇలా చెప్పుకుంటూపోతే చాలా వృత్తుల వారు సంతలను ఆశ్రయించి జీవించారు. వివిధ కులవృత్తులు మధ్య సఖ్యతను, సామరస్యమును పెంపొందించడం లో సంతల పాత్ర మరువలేనిది.

ముగింపు:

నా చిన్నతనం లో ఎవరైనా సంతకు బయలుదేరితే, మేము కూడా వెంట వస్తామని బ్రతిమాలేవాళ్ళం కజ్జిపుండలు, నెయ్యుండలు మొదలైన తినుబండారాలు దొరుకుతాయని ఆశ. ఇంక పండగ సంతలకు అయితే ఆనందానికి హద్దే ఉండేది కాదు. సుమారుగా ముప్పై ఏండ్ల క్రితం ఆధునిక రవాణా సదుపాయాలు లేని రోజుల్లో మా ఊరు నుండి సుమారుగా మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ, దారి మధ్యలో ఉన్న ఈతఅడవి లో రకరకాల మొక్కలను చెట్లను పరిశీలిస్తూ, వాకపండ్లు, రేగుపండ్లు, పరింపండ్లు, పిసినిక పండ్లు ఏరుకుంటూ, వాటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ నడిచే నడక ఎంతో ఆరోగ్యకరమైనది. ఇటీవల కాలంలో నేను నాఆరోగ్యం కోసం మా ఊరి నుండి అచ్యుతాపురం సంత వరకు మరలా తిరిగి మా ఊరికి నడచి వచ్చే క్రమంలో ఈ జ్ఞాపకాలు అన్ని నన్ను చుట్టుముడుతూ ఉంటాయి.

ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిన ఈ ఆధునిక తరానికి ఈ సంతల ప్రాముఖ్యత తెలియకపోవచ్చు, కానీ మానవ పరిణామ క్రమంలో మానవ సంఘ జీవనానికి దోహదం చేసిన అంశాలలో సంతలు మాత్రం చాలా ముఖ్యమైనవి. అటువంటి సంతల గొప్పతనాన్ని వివరించే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికి నా ధన్యవాదాలు.

ధన్యవాదాలు:

నాకు సంతలు గురించి విలువైన సమాచారం అందించిన నా ప్రియమిత్రుడు, 9వ తరగతి వరకు సహాధ్యాయి అయిన పుణ్యపు.అప్పలరాజు కి నా ప్రత్యేక ధన్యవాదాలు

The Flora and fauna that stated in the book Gadha Saptasathi. (Part-1)


Good morning my dear friends. It’s my pleasure to meet you again on my weblog. I have been confronting dreadful days during this September month of 2020. I lost my 2nd maternal uncle in this month. This month is one of the tragic months in my career. My 2nd maternal uncle’s name is Imandi. Arjun Rao, His family lives in Visakhapatnam. During Summer holidays I used to stay at his home along with my family. I have wonderful memories with my uncle. I can’t forget the moments that I have spent with him. He lives in my heart. My dear maternal uncle my sincere condolences to you.
My dear friends, today I am going to present some lovely verses from the book the Gadha Saptashati.

My beloved maternal uncle..

Some poets of Gadha saptashati have stated about some kinds of animals, birds and trees. We can find some Vedic Gothras in Hindu mythological writings. For example Gothama gothra (Ox), Vathsa gothra (Calf), Shunaka gothra (Dog), Koushika gothra (Owl), Manduka gothra (Frog), Kashyapa gothra (Turtle)… Etc. Even today most of the Hindu devotes offering prayers to animals and birds. We can find animal idols in Hindu temples.

According to the Hindu mythology Hindu Gods mount on animals or birds and travel to different worlds. For example,
Lord Shiva- Nandi (Ox)
Lord Vishnu-Garuda (Eagle)
Goddess Saraswati- Hamsa (Swan)
Lord Ganesha- Mushika (Mouse)
Lord Karthikeya- Mayura (Peacock)
Lord Yama- Mahisha (Buffalo)

Lord Kalki- Turaga (Stallion)
Lord Manmadha- Shuka (Parrot)…Etc. Today I am going to present some verses, in which the details of animals are presented.

Lions: (సింహాలు)

*****************©©©****************
ప్రాకృత మూలం;
భమ ధమ్మిఅ! వీసత్థో సో సుణఓ మారిఓ తేణ|
గోలాఅడవిఅడకుడంగవాసినా దరిఅసీహేణ||

*****************©©©******************
సంస్కృత మూలం;
భ్రమ ధార్మిక! విస్రబ్ధః స శునకో౮ద్య మారితస్తేన|
గోదాతటనికటకుంజవాసినా దృప్తసింహేన||
                  #వ్యాఘ్రస్వామి

******************©©©****************
తెలుగు అనువాదాలు;
బైరాగీ! ఒక నీ ఇచ్చ వచ్చినటుల
పర్యటించుము రవ్వంత భయములేక-
గోద తటమున సాంద్రమౌ గుబురులందు
సింహ మొక్కటి కుక్కను చీల్చి చంపె.
                 #డా.కోడూరు.ప్రభాకరరెడ్డి
*****************©©©***************
ఇచ్చకొలఁదిఁ దిరుగు మిఁక బైరాగి
గోదావరీతటమున దట్టమైన
పొదలఁ జేరి యొక్క పొగరైన,
సింగమాకుక్కపోతునిపుడు కొఱికి చంపె.
               #రాళ్లపల్లి.అనంతకృష్ణశర్మ
****************©©©****************
ఓయిధార్మిక! సంశయమొందవలదు
సంచరింపుము నీవు విస్రబ్ధగతుల   
వికటగోదాతటనికుంజవీథినున్న
క్రూరసింహమాకుక్కను కూల్చె నేడు.
                #నరాల.రామిరెడ్డి
*****************©©©***************
తెలుగు వ్యావహారిక అనువాదం;
భైరాగీ! ఇక నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు
గోదావరి గట్టున దట్టమైన పొదలో
మాటువేసి వుండే పొగరెక్కిన సింహం
ఈ రోజే ఆ కుక్కను చంపి తినింది.
                   #దీవి.సుబ్బారావు
*****************©©©*****************

English translation;

Oh! Monk! Walk and move freely everywhere on the bank of river “Godavari” without any fear or anxiety. Because? On the bank of “Godavari” river a lion killed a dog brutally.

© Vyaghra Swami

The story behind this verse is very funny. Let us observe the verse and the story behind it.


An adulteress made the arbour on the bank of the river “Godavari” as a rendezvous to meet her lover. She used to meet her lover at that secret meeting place regularly. She enjoyed there with her partner for a few days happily without any interruption. One day a hermit from the next village came to that village for begging alms. That monk chose the adulteress secret meeting place as his meditation place. From that day she felt very difficult to meet her lover at that place. One day she found that the monk had Cynophobia, the fear of dogs. Then she devised a plan to send him of from the arbour on the bank of river Godavari. The next day she met him on the way to the river and said to him as stated in the above verse. Actually her intention is to scare him. And she thought that a man who fears the dog is also fears the lion. And so she told to the monk about the brutal act of lion.


తెలుగు లో :

గోదావరి తటమున గల ఒక పొదరింటిని ఒక జవరాలికి సంకేతస్థలం. ఆ లతాగృహంలో మిటారి తన ప్రియసఖుడను కలుసుకొనేది. ఆ నికుంజములో ఆ అభిసారిక తన ప్రియునితో సరససల్లాపాలాడేది. ఇట్లా కొంతకాలం సాగిన తర్వాత ఒక బిక్షువు ఆ గ్రామానికి వచ్చాడు. నదీతీరాన గల ఆ మిటారి పొదరింటిని చూసి జపతపాదులకు అనువుగా ఉంటుందని అక్కడే మకాం పెట్టాడు. ఇది ఆ కోరికల చకోరికి అనిశపాతంలా తగిలింది. విరహ వేదనతో వేగిపోతూ ఆ సన్యాసి ఎలా అయినా ఆ నికుంజము నుండి వెళ్లగొట్టాలని పధకం వేసింది. ఊరిలో కుక్కలకు భయపడి ఆ సన్యాసి ఊరవతల నదీతీరాన మకాం వేశాడని గ్రహించింది, కుక్కకు భయపడేవాడు సింహానికి భయపడతాడని ఆలోచించి, ఆ జారిణి ఈ గాధను పైన చెప్పిన మాదిరిగా చెప్పింది. తమ సమాగమానికి ఆటంకం ఉండదని ఆ జాణ ఎత్తుగడ.


In this single verse we can observe the details about dog and lion. Prakrit poets depicted details about some animals beautifully in their verses. Let’s observe them.

Dogs (కుక్కలు):

**********************©©©**********************

ప్రాకృత మూలం:
వోడసుణఓ విఅణ్ణో అత్తా మత్తా పఈ వి అణ్ణత్థో|
ఫలిహం వ మోడిఅం మహిసఏణ కో తస్స సాహేఉ||
                    © కాలింగస్స

**********************©©©**********************

సంస్కృత మూలం:
దుష్టశునకో విపన్న: శ్వశ్రూర్మత్తా పతిరప్యన్యస్థ:|
కార్పాస్యపి భగ్నా మహిషకేణ కస్తస్య కథయతు||
                    © కళింగస్య

**********************©©©**********************

తెలుగు అనువాదాలు:
పిచ్చికుక్కకు ఆపద వచ్చి చచ్చె
అత్త చిత్తమ్ము మత్తున నత్తమిల్లె
పతియొ దూరగతి జనెను, ప్రత్తిచేను
దున్నపాలయ్యె చెప్పంగ త్రోవ యెద్ది?
                   © కళింగుడు
              # డా.కోడూరు.ప్రభాకరరెడ్డి

**********************©©©**********************

రెచ్చిపోయెడి మాకుక్క చచ్చిపోయె
విభుడు పరదేశి, అత్తకు పిచ్చిముదిరె
తొక్కె ప్రత్తిచేనంతయు దున్నపోతు
విభునికెవ్వడు చెప్పునో వెదకుచుంటి.
               # నరాల.రామిరెడ్డి

**********************©©©**********************
అత్త పడినదింట మత్తెక్కి; పతి యెందొ
పోయినాఁడు; గుక్కపోతు సచ్చె;
బ్రత్తిచేను విఱుగఁబడ మేసెనెనుబోతు;
దీనినతని కెవరు తెలుపువారు ?
              # రాళ్లపల్లి.అనంతకృష్ణశర్మ

**********************©©©**********************
కరిచే కుక్క చనిపోయింది
అత్త మత్తులో పడి వుంది
మగడు పొరుగూరు వెళ్ళాడు
పత్తిచేను దున్నపోతు తొక్కి పాడుచేసిందని
అతడికెవరు కబురుచేస్తారు?
             # దీవి.సుబ్బారావు

**********************©©©**********************

English translation;

The barking dog is dead, the mother-in-law is in intoxication and my husband has gone abroad. Who will inform my husband that the bull had destructed the cotton field last night?

©Kalinga

Let’s observe the story behind this verse. There was a lovely woman in a certain village. She used to meet her boyfriend in her cotton field, which is in the vicinity of the village. One day a bull spoiled her cotton field. She thought that it is impossible to meet her lover in the cotton field. While she was thinking like that, her boyfriend was going quickly to cotton field to meet her. When she saw him she began to talk with her neighbour woman in a loud manner. The boyfriend stopped and began to hear her words carefully and understood like below.

The barking dog is dead,
♂ There is no more disturbance with the dog.
♀ The mother-in-law is in intoxication.
♂ Mother-in-law is suffering from severe illness and there is no problem with the mother-in-law.
♀ My husband has gone abroad.
♂ Her husband won’t come until a week
♀ The bull had destructed the cotton field last night.
♂ No need to go cotton field and I can go to my girlfriend home directly to night.


తెలుగు లో;

ఒకానొక గ్రామంలో ఒక గడసరి మిటారి ఒకతి కలదు. ఆమె తన ప్రియుడను తనగ్రామ సమీపంలో గల తన ప్రత్తిపొలంలో రహస్య సమాగమాలను జరిపేది. ఒకరోజు ఒక దున్న పత్తిచేనును నాశనం చేసింది. తన ప్రియుడును కలవటం ఎలా అని ఆలోచిస్తుండగా, ఆమె ప్రియుడు ఆమెను కలుసుకోవడం కోసం పత్తిచేనుకు హడావిడిగా వెళ్ళటం చూసిన ఆ నెరజాణ అతనికి వినబడేట్లు, పక్కింటావిడ(దూతిక) తో పై గాధలో వివరించిన మాదిరిగా మాట్లాడింది. గాధను ఆ ప్రియుడు ఇలా అర్థం చేసుకుని ఉంటాడు,

®కరిచే కుక్క చనిపోయింది 
ఇంటికి వెళ్లినా కుక్క బెడద లేదు
®అత్త మత్తులో పడి వుంది
అత్త ఉందనే బెరుకు అవసరం లేదు
®మగడు పొరుగూరు వెళ్ళాడు
ధైర్యంగా ఇంటికెళ్లవచ్చు
®పత్తిచేను దున్నపోతు తొక్కి పాడుచేసిందని
అతడికెవరు కబురుచేస్తారు?
పత్తిచేనును కాకుండా నా ప్రేయసి ఇంటికే వెళ్ళవచ్చు.

In the above stated verse we can find the details of the  animals Dog and Bull.Thats all for today friends shortly I will meet you all. Thank you one and all.

Your fate is determined by your past actions.

Good morning my dear friends. I pray God to lift this plague from the earth and to save the humankind from the natural calamities.


Today I would like to present one verse from the section Yamaka vagga from the book, the Dhamma pada. All the verses in this section are like relatively twins that’s why this section is called twin verses section.

Evil begets evil

ENGLISH TRANSLITERATION
Manopubbaṅgamā dhammā,
manoseṭṭhā manomayā;
Manasā ce paduṭṭhena,
bhāsati vā karoti vā;
Tato naṃ dukkhamanveti,
cakkaṃva vahato padaṃ.
TELUGU TRANSLITERATION
మనోపుబ్బఙ్గమా ధమ్మా, 
మనోసేట్ఠా మనోమయా;
మనసా చే పదుట్ఠేన,
భాసతి వా కరోతి వా;
తతో నం దుక్ఖమన్వేతి,
చక్కంవ వహతో పదం
Telugutranslation:
అన్ని[చెడు]చేతనావస్థలకు మూలం
మనసే. మనసు వాటికి అధిపతి.
ఎవరైనా కలుషితమనోవాక్కర్మలచే
ప్రవర్తిస్తే, అట్టి వానిని దుఃఖం,
బండిని లాగే ఎద్దు గిట్టలను
అనుసరించే చక్రంలా అనుసరిస్తుంది.
Evil begets evil

English translation:
Mind is the forerunner of
all [evil] states. Mind is their chieftain. If one speaks or acts with wicked mind, and so the suffering follows them just like the wheel follows the hooves of the wagon-ox.

While residing at the Jetavana monastery in Savitthi,  Buddha uttered this verse. He uttered this verse, with reference to a blind monk Chukkapala.

Story:

Chukkapala was a blind monk, who was leading an ascetic life to attain arahantship*. As the result of his strenuous endeavours, he attained the arahantship, the final stage of sainthood, but unfortunately he went blind. One day on a special occasion, the blind monk came to the Jetavana monastery to pay homage to Buddha. On that night while he was meditating  upside down accidentally he stepped on some insects. In the morning some ascetics visited the monastery and found the dead insects. And they had decided to inform this ill act to Buddha. When they informed about the evil act of Chukkapala, to Lord Buddha, Buddha asked them whether you had seen while the monk was killing insects. They replied in negative.

Then Buddha said as you had not seen him while he was killing those insects, just like that he also had not seen those innocent living insects, And Goutham Buddha added, “All of you know that the ascetic had already attained his Arhantship. So he couldn’t have an intention to kill innocent insects, so he is innocent.”

Then his disciples asked Goutham Buddha, “Why the monk was being blind man”.  Then Goutham Buddha started to explain the Chukka pala’s past life to his disciples.

Chukka pala was a physician in one of his past existences. One day a woman, who was suffering from chronic eye disease came to that physician. She asked him for medical aid. After examining her eye, chukka pala assured the woman that he can cure her sickness. Then she promised him as “if you cure my malady I will serve you until my last breath along with my only son.”

In a short time the physician started the treatment, and she began to gain her vision slowly. But she feared about her promise. So she deviced a plan to escape the promise. When the Doctor enquired about her eyesight, she told him that her eye health was becoming worse. The physician smelled her plan, and gave her poisened(wrong)  drug to lost her eyesight. As a result she lost her vision.

Goutham Buddha concluded to his followers that  “Chukka pala’s past deeds are reflecting in his present.”


This is the first verse in the book, The Dhamma pada. And this is the story behind the verse. I will send its twin verse in my upcoming blog. Thank you one and all.

గాధాసప్తశతి- ప్రణయ ప్రపంచం-2

శుభోదయం మిత్రులారా. నా బ్లాగ్ కు పునఃస్వాగతం. గత బ్లాగ్ లో కొన్ని ప్రణయసంబంద గాధలను వివరించాను, ఈ బ్లాగ్ లో మరికొన్ని వివరించి ముగించప్రయత్నం చేస్తాను.

సరియైన వ్యక్తిని చూసి ప్రేమించగలగటం అతివల కనులకున్న గొప్ప నేర్పు. ఆధునిక పరిశోధనలు  కూడా స్త్రీలు, పురుషుల భౌతిక లక్షణాల ఆధారంగా వారి  టెస్టోస్టిరోన్ హార్మోన్ స్థాయిలను అంచనావేసి తమకు సరిపడు జతను కనుక్కుంటారని ఊహిస్తున్నాయి*. ఇటువంటి భావనను ఈ క్రింది గాధలో చూడవచ్చు.           【*ఈవిషయం పై పరిశోధనలు కొనసాగుతున్నాయి.】

ప్రాకృత మూలం:
సచ్చం జాణఇ దట్టుం సరిసమ్మి
జణమ్మి జుజ్జఏ రాఓ ౹
మరఉ ణ తుమం భణిస్సం
మరణం వి సలాహణిజ్జం సే ॥
#దుగ్గసామిణో
***********************************
సంస్కృత మూలం:
సత్యం జానాతి ద్రష్టుం సదృశే
జనే యుజ్యతే రాగః॥
మ్రియతాం న త్వాం భణిష్యామి
శ్లాఘనీయం తస్యా॥
#దుర్గస్వామినః
***********************************
తెలుగు అనువాదం:
ఋతము కనుగొనగలవి యా ఇంతికనులు
తమకు తగవైన వారితో తగును ప్రేమ
ఇంతి చచ్చిన నిన్ను నిందించబోను
తరుణి చావైన నుతియించ దగినదోయి
#దుర్గస్వామి
@కోడూరు.ప్రభాకరరెడ్డి

నాయకుడిని ప్రసంసాపూర్వకంగా నిందిస్తూ దూతిక ఇలా అంటుంది. “నా సఖి నిన్నుచూడ ఆరాటపడుతోంది. ఆమె తనకు తగిన సరిజోడును ఎన్నుకోగల స్పృహ, తెలివిగలది. ఏకాభిప్రాయంగల వ్యక్తుల మధ్య మాత్రమే ప్రేమ సఫలం అవుతుంది. ఒకవేళ ఆమె మరణించిన నిన్ను నిదించబోను, ఆమె చావు కూడా ప్రశంసించదగినది”. కానీ దూతిక అసలు ఉద్దేశ్యం “ఓయి, సరి అయిన వ్యక్తిని ప్రేమించగలగటం ఇంతి కన్నులకున్న గొప్ప నేర్పు, కానీ ఆ వ్యక్తి ప్రేమిస్తాడని నమ్మకం లేక, తగని వాడిని ప్రేమించలేక, తగినవాడిని సాధించలేక, నిరాశతో నీ నామస్మరణతో చావడమే మేలని భావిస్తున్న నా ప్రియసఖిని నీ ప్రేమతో ధన్యురాలని చేసి ఆమె ప్రాణాలను కాపాడమని.” చెప్పటమే. అతని నామస్మరణ చేస్తూ మరణిస్తే మారుజన్మలో అతన్ని పొందగలదని దూతిక విశ్వాసం. ఇటువంటి భావనను మనం శ్రీమద్భగవద్గీత లో చూడవచ్చు.

===============©©©==================
యం యం వాపి స్మరాన్ భావం
త్యజత్యంతే కళేబరమ్ తం తమేవైతి
కౌంతేయ! సదా తద్భావ భావితః ||

భావం:కౌంతేయా! మనుజుడు అవసానదశలో ఏయే భావాలను స్మరిస్తూ దేహాన్ని త్యజిస్తాడో ఆవ్యక్తిమరుజన్మలో ఆయా భావాలను పొందగలడు.
===============©©©===================

ఇంతలోనే ఇతగాడెందుకు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు అని అడుగగా అతని మిత్రుడిలా ఎకసక్కెంగా ఇలా అంటున్నాడు.

===============@@@=================
ప్రాకృత మూలం:
ఎక్కో వి కహ్ణసారో ణ దేఇ
గన్తుం పఆహిణవలన్తో ౹
కిం ఉణ బాహాఉలిఅం
లోఅణజుఅలం పిఅఅమాపఎ ॥
#కాలసారస్స
===============@@@==================
సంస్కృత అనువాదం:
ఏకోఅపి కృష్ణసారో న దదాతి
గంతుం ప్రదక్షిణం వలన్ ౹
కిం పునర్బాష్పాకులితం లోచన
యుగళం ప్రియతమాయాః ॥
#కాలసారస్య
===============@@@===================
తెలుగు అనువాదం:
కృష్ణమృగమొక్కటెదురైన కీడటంచు
యాత్ర నిలుచును-ప్రియతమ నేత్రయుగళి
బాష్ప పూర్ణములగుచును బాధపెట్ట
ప్రియుడు పోనెంచునే యాత్ర ప్రీతితోడ
#కాలసారుడు
#కోడూరు.ప్రభాకరరెడ్డి.

ప్రయాణారంభంలో దారికి అడ్డంగా కృష్ణజింక ఎదురు వస్తే ఆ ప్రయాణాన్ని ఆపుచేస్తారు, అలాంటిది, కృష్ణసార సదృశ బాష్పకులిత, సంచలిత కనుదోయితో ప్రియురాలు ఎదురువస్తే నాయకుని ప్రయాణం ఎట్లా ముందుకు సాగుతుంది. ప్రయాణం ఆగిపోకుండా ఉంటుందా.


తన ప్రియుడు ప్రవాసమేగి చాలా కాలం అయింది. తన సఖుడున్న ప్రదేశమేగుతున్న పాంథులతో ఓ ప్రోషితపతిక* నాయకుడిని వేగంగా తోడ్కొని రమ్మని కోరుతూ తన విరహవేదనను ఎలా చెప్తుందో చూడండి.

ప్రాకృత మూలం:
అజ్జ మఏ తేణ విణా
అణుహూఅసుహాఇం సంభరంతీఏ ౹
అహిణవమేహాణం రవో
ణిసామిఓ వజ్ఝపడహో వ్వ ॥
#కల్లాణస్స
===============@@@================
సంస్కృత అనువాదం:
అద్యమయా తేన వినా
అనుభూతసుఖాని సంస్మరంత్యా ౹
అభినవ మేఘానాం రవో
నిశామితో వధ్యపటహ ఇవ ॥
#కల్యాణస్య
===============@@@=================
తెలుగు అనువాదం:
సఖుడు నా చెంత లేనట్టి సమయమందు
వానితోడి సుఖానుభవమ్ము లవియ
ఘన పయోధర నిర్గమ గర్జలెల్ల
వధ్యపటహధ్వని* వలె కంపమును గొల్పు!
#కల్యాణుడు
#కోడూరు.ప్రభాకరరెడ్డి
===============@@@=================
*ప్రోషితపతిక అనగా
నాయకుడు పరదేశమేగగా,
వియోగంతో వ్యాకులపడే నాయిక.
*వధ్యపటహ ధ్వని అనగా
ఉరితీసే ముందు మ్రోగించే
భేరినాదం.

ప్రియుడు నా చెంతనుండగా మేఘగర్జనను విని హడలి చెలుని కౌగిట ఒదిగి ధైర్యంగా ఉండేదాన్ని, ప్రియుడు పరదేశమేగి నన్ను ఒంటరిని చేసిన సందర్భంలో ఈ కారుమేఘగర్జనలు నన్ను ఉరితీసే ముందు మ్రోగించే భేరినాదాల్లా నను భయకంపితరాలను చేస్తున్నాయి, నాప్రియుణ్ణి వేగిరమే వచ్చి నన్ను చేరమని చెప్పండని అర్ధిస్తున్నది.


ప్రియచెలుడు నాయిక స్వగ్రామంలోనే ఉండి నాయికను నిరాదరణ చేస్తే అటువంటి ఓ విరహోత్కంఠిక* విరహవేదనను ఈ క్రింది. గాధలో గమనించండి.

ప్రాకృత మూలం:
విరహాణలో సహిజ్జఇ ఆసాబన్డేణ
వల్లహజణస్స ౹
ఏకగ్గామపవాసో మాఏ మరణం
విసేసేఇ ॥
#అమిఅస్స
===============@@@=================
సంస్కృత అనువాదం:
విరహానలః సహ్యత ఆశాబన్థేన
వల్లభజనస్య ౹౹
ఏకగ్రామ ప్రవాసో మాతర్మరణం
విశేషయతి ॥
#అమృతస్య
===============@@@=================
తెలుగు అనువాదం:
ఎప్పుడో అపుడు కలియు
ఏషతోడ ప్రియుని విరహమ్ము
నెటులొ భరింపవచ్చు ఊరనున్న
ప్రియుడు కలియకున్న యెడల
మృత్యు ముఖమున బడుటయే
మేలు తల్లి!
#అమృతుడు
#కోడూరు.ప్రభాకరరెడ్డి
*విరహోత్కంఠిక అనగా
నాయకుడు నిర్ణీత సంకేతస్థలానికి
రానందున విరహంతో చింతించే నాయిక.

ప్రవాసంలో ఉన్న నాయకుడు ఎప్పుడో ఒకప్పుడు వస్తాడన్న ఆశతో విరహాన్ని భరించి కాలం గడపవచ్చు, కానీ ప్రియమనోవల్లభుడు స్వగ్రామంలో వుండి కలుసుకోకుండా ఉండడం కంటే మరణమే మేలన్న ఆమె విరహావేదనను మనకు ప్రాకృత కవులు ఎంత చక్కగా వివరించారు.


మిత్రులారా సుమారుగా ఏడువందలుకు పైబడి గాధలున్న గాధాసప్తశతీ లో ప్రతీ గాధా ఒక ఆణిముత్యం ఇది మంచిది, ఇది చెడ్డది అని వివేచన చేయలేము కనుక ప్రస్తుతానికి ఈ బ్లాగ్ ను సశేషంగా ముగించి తదుపరి బ్లాగ్ లో మరిన్ని గాధలను అందించప్రయత్నం చేస్తాను. ఇది కోవిడ్19 మహమ్మారి కాలం అయినప్పటికీ ఎవరి పనిలో వారు హడావిడిగా తీరుబడి లేకుండా ఉంటారు కనుక బ్లాగ్ నివిడి ఎక్కువగా ఉంటే చదివే తీరుబడి కూడా ఉండదు కనుక ఇప్పటికి ఇలా ముగించి మరలా మిమ్ములను నా బ్లాగ్ ద్వారా కలిసే ప్రయత్నం చేస్తాను.

ధన్యవాదములతో మీ ప్రియ మిత్రుడు

Thirst of love…

Good morning my dear friends. Welcome back to my blog. I have been busy with my psychology assignments and also  busy at learning Sanskrit language. That’s why I published this blog quite lately. Today I’m going to discuss about a single verse from the book Gadha Saptasathi

If the love starts suddenly between two lovers on their first sight, how beautiful the situation is! One prakrit poet express this lovely situation into a wonderful and romantic rhetorical verse. Let’s observe it.


Prakrit root:
ఉద్దచ్ఛో పీఅఇ జలం జల జహ
విరలంగులీ చిరం వహిఓ ౹౹
పావాలిఆ వి తహ తహ ధారం
తుణుఇం పి తణుఏఇ ౹౹
@భాడ్డఅస్స
==========================
Sanskrit translation:
ఊర్వాక్ష: పిబతి జలం యథా
యథా విరళాంగుళిశ్చిరం పథికః ౹౹
ప్రపాపాలికాపి తథా తథా ధారాం 
తనుకామపి తనూకరోతి ౹౹
@భాడ్డకస్య
===========================
Telugu translation:
వ్రేళులను విచ్చి పైచూపు పెట్టి జలము
తిన్నగా త్రావు పాంథుని తీరు చూచి
ప్రపను గాచెడి వయ్యారి భామకూడ
సన్న జలధార నింకను సన్నబరచె.
@భాండకుడు
#కోడూరు.ప్రభాకరెడ్డి
=========***===============
వ్రేళ్ళు సడలించి మీగన్ను పెట్టి నీరు
తిన్నగా ద్రాగు తెరువరి తెఱగు సూచి,
యవుర! చలిపందిటిని గాచునతివగూడ
సన్ననౌ ధార మఱియును సన్నగించు.
#రాళ్లపల్లి.అనంతకృష్ణశర్మ
=========***===============
కనులుపైకెత్తి వ్రేళ్ళు విచ్చునటుచేెసి
జలముత్రావగా పథికుడు చాలాసేపు
వానిగని చలివెందర చానకూడా
స్వల్పజలధారనింక స్వల్పముగజేసే.
#నరాల.రామిరెడ్డి
=========***================
చేతివేళ్ళు ఎడం చేసి
ముఖం పైకెత్తి పెట్టి చూస్తూ
నీళ్లు తాగే బాటసారి
యువకుని వాలకం కనిపెట్టి
చలివేంద్రం దగ్గర చిన్నది కూడా
సన్నటి నీటిధారను ఇంకా సన్నం చేస్తున్నది.
#దీవి.సుబ్బారావు.
================***===============

English translation:

The traveller raises his eyes upwards, stretched his fingers of his both palms and he is drinking water with delaying tactice. So also the young woman at the drinking water supply tent reduces the trickle of water.


Story ;

Even travellers have to face the love thirst in the middle of the summer. The summer heat scorches their body while their love thirst burns their mind. It’s a lovely and wonderful situation mentioned  in the below story.

It’s a small and beautiful village. The kind-hearted village head of that village had installed a summer water supply tent in the vicinity of that village, and recruited a lovely young woman as a water supplier. She was supplying water to all travellers and pedestrians from morning to evening as a routine. One day a handsome mischievous youngman came to that water tent.

ప్రపాపాలిక 【a water serving maid】

She stood on the dias, bending hers waist and she was pouring water to the travellers. Then he stood infront of her, casted his sight on her face and requested her to pour water. She also looked into his eyes and began to pour water in his palms. He began to expand his fingers on his palms with a tactice to delay in drinking of water. On seeing this she began to reduce the trickle of water. The young traveller captivated by her beauty, began to drink little amount of water to delay drinking of water. The young woman water supplier reduced the trickle of water.

Thus the first love kindled in their hearts. A poet, who was observing this romantic situation carved this lovely scene into a beautiful rhetorical verse

#Stay home stay safe.

గాధాసప్తశతి- ప్రణయ ప్రపంచం-1

శుభోదయం మిత్రులారా.  చాలా రోజుల నుండి తెలుగు లో నా బ్లాగు ను ప్రచురించాలని అనుకుంటన్నాను అది ఈ నాటికి కార్యరూపం దాల్చటం చాలా ఆనందంగా ఉంది. ఈ బ్లాగ్ ద్వారా గాధా సప్తశతీ నందు గల కొన్ని పద్యములను మీకు అందించే ప్రయత్నం చేస్తాను, ఆనందించి, ఆశీర్వదించండి.

ప్రేమ అనేది ఒక అద్భుత, సుందర, అనిర్వచనీయ అనుభూతి. మాటల్లోవర్ణించటం కంటే చేతల్లో అనుభవిస్తేనే బావుంటుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో అనుభవించాల్సిన అనుభూతి ప్రేమ. ఈ ప్రేమ ఏడేడు జన్మల నుండి ముడిపడ్డ బంధం. ప్రేమ, ప్రాతఃకాలాన వికసించి, మరునాటి సంధ్య వేళకు వాడిపోయే కుసుమం కాదు. ప్రణయం, శృంగారం, ప్రేమ అనేవి పర్యాయపదాలు. ప్రణయం అనేది మానసికమైనది, ఈ మానసికచేష్టలు భావావేశానుగుణంగా భౌతికంగా వ్యక్తం చేయబడతాయి. దీనికి ప్రకృతి ప్రేరణను కలిగిస్తుంది. ఈ ప్రేరణ ద్వారా ఆకర్షణ తద్వారా సాన్నిహిత్యం కలుగుతుంది. ఈ పరిచయం, స్నేహం, ప్రణయం, చివరకు దాంపత్యంగా పరిణామం చెందుతుంది. అదే సమయంలో ఈ ఇంద్రియలోలత్వాన్ని అదుపుచేసేందుకు సమాజము సంస్కృతి, కట్టుబాట్లను ఏర్పరిచింది. వీటివలన ఈ ప్రేమభావం త్యాగంగా వ్యక్తీకరణ చేయబడుతుంది. ఈ మౌళిక సూత్రాలను లెక్కచేయని ప్రేమభావం కామంగా, మొహంగా పరిగణింపబడుతుంది, మరియు మానసిక దౌర్బల్యానికి దారితీస్తుంది. శరీరానికి ఆకలి, దప్పిక, నిద్ర వలే లైంగిక వాంఛ కూడా ప్రాధమిక అవసరం. మనోవైజ్ఞానికులు పేర్కొన్నట్టు లైంగిక వాంఛ వివిధ దశలలో వివిధ రూపాలలో అభివ్యక్తం చేయబడుతుంది. ఈ లైంగిక వాంఛను విశృంఖల విహారం చేయకుండా తగు కట్టుబాట్లను ఏర్పరిచారు. “కులపాలికాశృంగారాన్ని” సంఘంలోని నీతికోవిదులు ఏర్పాటు చేసి అదే ఉత్కృష్టదాంపత్యమని బోధించారు. ప్రణయం సృష్టికి మూలం. ప్రణయగుణం లేని ప్రకృతి వికృతే.

ఇద్దరు వ్యక్తులలో ఉండే ఒకే ఆత్మ ప్రేమ.

#ప్లేటో

ప్రాకృత కవులు ఈ ప్రణయాన్ని కాల్పనిక దృష్టితో కాంచి వాటిని అద్భుతంగా తమ గాధలలో అక్షరబద్దం చేశారు. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.

ప్రేమ గుణం, ఆలాపం, ఉల్లాపం,సహవాసం, కుతూహలం, ప్రియ గుణగణనం అనే మెట్లమీదుగా ఉన్నతస్థలిని చేరుకుంటుంది. ప్రేమికులు చాలా కాలంగా వియోగంలో ఉన్నా, అదర్శనం వలన, అధికదర్శనం వలన, చెడు సలహాలను ఆచరించుటవలన, వక్రభాష్యాల వలన దూరం కావచ్చు. ఈ క్రింది గాధను చదవండి.

ప్రాకృత మూలం:
అద్దంసణేణ పెమ్మం ఆవేఇ
అదంసణేణ వి ఆవేఇ ౹
పిసుణజణజమ్పఏణ వి
ఆవేఇ ఏమఅ వి అవేఇ ౹౹
#సామిఅస్స
*************************
సంస్కృత మూలం:
అదర్శనేన ప్రేమాపైత్యతి
దర్శనేనాప్యపైతి ౹
పీశునజనజల్పితేనాప్యపైత్యేవమే
వాప్యపైతి౹౹
#స్వామికస్య
*************************
తెలుగు అనువాదం:
దర్శనములేక వలపు పొదలగబోదు
తరచు దర్శనమున ప్రేమ తరిగిపోవు
తులువ పలుకులతో రక్తి తొలగిపోవు
కారణము లేకయును రహి కడచి పోవు
#స్వామియశుడు
@కోడూరు.ప్రభాకరరెడ్డి.
**************************

ప్రేమ యొక్క స్వభావాన్ని ఒక దూతిక తన ప్రియసఖి కి ఎలా వివరిస్తుందో ఈ క్రింద గాధలో చదవండి.

ప్రాకృత మూలం:
***********************
సహి! ఈరిసివ్విఅ గఈ మా
రువ్వసు తంసవలిఅముహఅంద౹
ఏఆణం వాలవాలుంకితంతుకుడిలాణం పేమ్మాణం౹౹
#అలఅస్స
సంస్కృత అనువాదం:
*************************
సఖిః! ఈదృశ్యేవ గతిర్మా
రోడీస్తర్యగ్వలితముఖచంద్రమ్ ౹
ఏతేషాం బాలకర్కటీతంతుకుటిలానాం ప్రేమ్ణామ్౹౹
#అలకస్య
తెలుగు అనువాదం:
**************************
కొమ్మ! లేదోస లతవోలె కుటిలప్రేమ
వక్రముగ సాగు సతతము వసుధయందు
అడ్డముగ త్రిప్పి ముఖమును అబ్జవదన!
కడుపు రగులగ నేడ్చుట కాని పనియ.
#అలయుడు
@కోడూరు.ప్రభాకరరెడ్డి

కలహాంతరిత అయిన సఖిని మరల ప్రణయోన్ముఖురాలను చేయుటకు దూతిక ఆమెతో ఇలా అంటున్నది, “ఓ సఖీ! లేతదోస తీగవలె కుటీలప్రేమ ఎన్నడూ సవ్యమైన మార్గంలో   ప్రయాణించదు నీముఖ పద్మాన్ని ఆవలకు త్రిప్పి దుఃఖించవద్దు.” కానీ దూతిక అసలు ఉద్దేశ్యం ” సఖీ! నీప్రియునిపై అమర్ష భావంతో వాడిని తిరస్కరించకు, అలా చేస్తే మీ ప్రేమ లేతదోసతీగ వలె ముక్కలవుతుంది. అందువల్ల నీ ప్రియుణ్ణి తిరస్కరించకుండా సంయమనంతో ఆహ్వానించమని చెప్పటమే. ఇచట కలహాంతరిత అంటే ప్రియుడు చేసిన అపరాధం వలన అతనిపై కోపంతో అతనిని తిరస్కరించేది అని అర్ధం.


అన్యాసక్తుడైన ప్రియునితో తన ప్రణయభంగాన్ని విస్మయంతో తనకు అత్త వరసయ్యే ఆవిడతో ఒక నాయిక ఎంత చమత్కారంగా చెప్తుందో, ఈ క్రింది గాధలో హాలుడు ఎంత చక్కగా అక్షరబద్దం చేసాడో చదవండి.

ప్రాకృత మూలం:
తహ తస్స మాణపరివడ్ఢి అస్స
చిరపణఅవద్ధ మూలస్స ౹
మామి పడన్తస్స సుఓ సద్దో వి ణ పెమ్మరుక్ఖస్స ౹౹
#హాలస్స
*************************
సంస్కృత అనువాదం:
తథా తస్య మానపరివర్ధితస్య చిరప్రణయబద్ధమూలస్య ౹
మాతులాని పతతః శ్రుతః శబ్దో
అపి న ప్రేమవృక్షస్య ౹౹
#హాలస్య
***************************
తెలుగు అనువాదం:
మన్ననలతోడ వర్ధిల్లె నిన్ని నాళ్ళు
ప్రేమ గాఢముగ నొదవి వేరుబలిసె
అట్టి ప్రేమ వృక్షము కూలు నదను
నందు చప్పడైనను లేదింత చెప్పు మత్త.
@కోడూరు.ప్రభాకరెడ్డి
#హాలుడు

అభిమానంతో ఇన్నినాళ్ళు వర్ధిల్లి వేళ్ళూనిన ప్రేమ వృక్షం చడీచప్పుడు లేకుండా కూలిపోయిందత్తా అంటూ తన ప్రణయభంగాన్ని ఎంత చక్కగా మార్మికంగా ఎరుకపరిచిందో చూడండి.

ప్రేమికుల మధ్య కలహపు జడివాన వెలిసిన వెంటనే వారి పునఃస్సమాగమం కొత్త ప్రణయసుఖలకు స్వాగతం పలుకుతుంది. కానీ ఆ కలహం సమసిపోని యెడల అది ప్రణయభంగానికి దారితీయును. మితిమీరిన గర్వం, ఎదుటివారిని అధమంగా చూడటం, హేళనగా మాట్లాడటం వంటి చర్యలు ప్రణయదహనానికి దారితీయును. ఈ క్రింది గాధలో ఒక దూతిక నాయికకు కోపోపశమనంను ఎలా బోధిస్తుందో చుడండి.

ప్రాకృత మూలం:
సచ్చం కలహే కలహే సురఆరమ్భా
పుణో ణవా హోన్తి ౹
మాణో ఉణ మాణంసిణి గరుఓ
పేమ్మం విణాసేఇ ॥
***************************
సంస్కృత అనువాదం:
సత్యం కలహే - కలహే సురతారమ్బా: పునర్నవా భవన్తి ౹
మానః పునర్మనస్విని గురుక: ప్రేమ వినాశయతి ॥
***************************
తెలుగు అనువాదం:
ప్రణయ కలహాల యందున పంచమమ్ము*
క్రొత్త రూపును దాల్చును కొమ్మ నిజము
కాని పొలయల్కపెరిగిన చాన వినుమ
ప్రేమ నయ్యది మొదలంట పెల్లగించు.
#అనురాగ
@కోడూరు. ప్రభాకరరెడ్డి.
*పంచమమ్ము=సురతము

ప్రణయ కలహములందు సురతము క్రొంగొత్తగా కనిపిస్తుంది. కానీ అలుకబూని శఠం వహిస్తే అది అతివేగంగా ప్రణయాన్ని నాశనం చేస్తుంది కనుక అలుక తగదని బోధిస్తోంది.


కోరుకున్న నవయవ్వన సుందరాంగుడిని పొందలేక కుంగిపోతున్న నాయికతో దూతిక ప్రేమ స్వభావాన్ని ఈ క్రింది గాధలో ఎలా వివరిస్తుందో చూడండి.

ప్రాకృత మూలం:
కిం రుమవసి కిం అ సోఅసి కిం
కుప్పసి సుఅణు ఏక్కమేక్కస్స ౹
పేమ్మం విసం వ విసమం సాహసు
కో రున్ధిఉం తరఇ ౹౹
**************************
కిం రోదిషికిం చ శోచసి కిం కుప్యసి
సుతను ఏకైకస్మై ౹
ప్రేమ విషమివ విషమం కథయ
కో రోద్థుం శక్నోతి ౹౹
తెలుగు అనువాదం:
ఏల రోదింతు? వేల చింతింతు ? వేల
కోపపడెద? వొక్కని గూర్చి కోమలాంగి!
విషము మాడ్కి ప్రేమయు కడు విషమ మగును
దాని నెవరడ్డగింతురే ధాత్రిలోన
#ఈశ్వరుడు
@కోడూరు.ప్రభాకరరెడ్డి

ఓ సుందరాంగి ! ఒక్కనిపైనే మనసుపడి ఏల ఇంత హృదయవిదారకంగా విలపిస్తావు? ఊరకనే అందరిని కోపగిస్తావెందుకు? ప్రేమ విషం వలె భయంకరమైంది, దాని నిరోధించడం ఎవరికి సాధ్యము కాదు అంటూ దూతిక నాయికను ఊరడిస్తుంది. ఇటువంటి భావము తో మఱియొక గాధ కలదు పరికించండి.

ప్రాకృత మూలం:
ఏణ్హిం వారేఇ జణో తఇఆ
మూహల్లఓ కహిం వ్వ గఓ ॥
జాహే విసం వ్వ జాఅం
సవ్వంగపహోలిరం పేమ్మ ౹౹
#సిరిసుందరస్స
************************
సంస్కృత అనువాదం:
ఇదానీం వారయతి జనస్తదా
మూలకః కుత్రాపి వా గతః ౹
యదా విషమివ జాతం
సర్వాంగఘార్ణితం ప్రేమ ౹౹
#శ్రీసుందరస్య
***************************
తెలుగు అనువాదం:
ఎక్కడుండిరో మూగలై యెల్లజనులు
నిపుడు వారించు చుండ్రి యేమేమొ నుడివి
గరళమునుబోలి యోర్వ శక్యమ్ము గాక
కాయమంతయు ప్రేమమ్ము కడలుకొనగ !
#శ్రీ సుందరుడు
@కోడూరు.ప్రభాకరరెడ్డి

నాయకునిపై అత్యంతానురాగవశయైన నాయికను అంత ఒడలు మరచి ప్రేమలో పడరాదని నిందాబోధన చేస్తున్న దూతికలను నాయిక ఇలా నిందిస్తుంది.

“అప్పుడు మీరంతా మూగవాళ్ళా, మీరంతా ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రేమ విషం వలె శరీరంమంతా పాకి ప్రభావం చూపిన తర్వాత వద్దని వారిస్తున్నారు.”

మిత్రులారా, మిగిలిన గాధలను తదుపరి బ్లాగ్ గాధాసప్తశతి- ప్రణయ ప్రపంచం-2 లో మీకు అందించే ప్రయత్నం చేస్తాను.

ఉపయుక్త గ్రంధావళి.

  1. The Prakrit Gadha saptasati By Radha Govind Basak (Eng)
  2. Hala’s SattaSai by Khoroche & Teken
  3. గాథాసప్తశతి- సౌందర్య గాథ by Dr.A.Subba Rayudu
  4. ప్రాకృత గాథాసప్తశతి by D.Subba Rao
  5. గాథా త్రిశతి. By N.Rami Reddy
  6. గాథా త్రిశతి. By Dr.K.Prabhakara Reddy
  7. గాథా చతుశ్శతి. By Dr.K.Prabhakara Reddy
  8. గాథాసప్తశతి సారము By Rallapalli.Ananta Krishna Sharma.

#Stay home stay safe.

Gadha saptasathi and the vegetation stated in it.

Good morning friends. May God stretch out His immense hands to save the world from the covid-19 pandemic. May God bless all the  families with health and wealth. Now covid-19 warriors are working very hard by risking their lives to save strangers, so we should honour them as an incarnation of God. Let’s recognize and respect their efforts.

Today I would like to present my blog on Gadha saptasathi in a different perspective. Until now I have discussed in detailed about a single verse. Today I am going to present the blog regarding to a particular topic related to the book, Gadha saptasathi. Today I am going to discuss about plants and vegetation stated in the book Gadha saptasathi.


Madhuca longifolia / Madhuca indica

మధూక / ఇప్ప చెట్టు

Madhuca longifolia buds

Madhuca longifolia flowers are in saffron colour and soft as a woman’s cheek. They are nocturnal flowers, that means they bloom in the night time. They have very special medical, economical values. A kind of liquor called “ippa saara” is prepared from these flowers. A kind of of oil called “ippa tailam” is also prepared from these flowers. This oil is used as a medical oil for skin allergies. Some people use these dried flowers as a offerings to god. That’s why the villagers/tribals collected them to get livelihood. There are some different verses in which they had the information about Madhuca longifolia flowers in the book of Gadha saptasathi. Let’s observe those Gadhas.


Verse 2-3:
పెక్కువిరుల బరువుచే వంచబడిన
నేలనంటిన కొమ్మలతో గోదావరినది
ఒడ్డున అల్లిబిల్లిగా ఉన్న మధూకమా! 
నావిన్నపం ఆలించి నెమ్మదిగా విరులు రాల్చుము.
Madhuca longifolia flowers.

In the above mentioned verse a countryside young woman praying a lovely Madhuca longifolia tree on the shore of the Godavari river to flowering its flowers slowly. We can understand the actual story is like below.                                                                           

There was a madhuca longifolia tree on the shore of Godavari. A young girl used to come to this Madhuca longifolia tree to meet her lover in the name of the collection of Madhuca longifolia flowers. An arbour beside that Madhuca longifolia tree was their secret romantic place. Day by day that tree is flowering its flowers more and more. More flowers fell off from that tree. Only a few flowers remain in the tree. The season time of Madhuca longifolia flowers is very near to end. The remaining flowers are going to flowering within three or four days. If that tree flowering all flowers, she may not able to meet her lover. That’s why  she is praying the tree to release the flowers slowly.


An arbour 【పొదరిల్లు】
Verse2-4:

గుండెలవియంగ నేడ్చుచు గుమ్మ యొకతె
ఏరుచున్నది రాలిన ఇప్పపూలు- 
ఆత్మబంధువు లెవ్వరో అంత మొంద
ఎముకలను వల్లకాటిలోన నెమకినట్లు.

A young woman is grieving bitterly while collecting the Madhuca longifolia flowers under that tree, as if she is collecting the bones on the ashes of her nearest relatives in the cemetery instead of Madhuca longifolia flowers. A young man who saw it, said as above in the verse. The actual story behind the verse can understand like the below.

A young adulteress used to come to this Madhuca longifolia tree to meet her lover in the name of the collection of Madhuca longifolia flowers. An arbour beside that Madhuca longifolia tree was their secret romantic place. Day by day that tree flowering its flowers more and more. Only a few flowers are in the tree. The season time of Madhuca longifolia flowers is very near to end. The remaining flowers are going to flowering within a week. If that tree flowering all flowers, she may not able to meet her lover. When this thought came into her mind, she trembled in fear and she felt bitter grief. Then she expressed her grief as if she is collecting the bones on the ashes of her nearest relatives in the cemetery instead of flowers.


A Madhuca longifilia tree
ఇప్పపువ్వులొక్కటే ఏమి
ఒంటిమీద చీరలాక్కున్నా
ఎవరితో చెప్పుకొనేది ఈ అడవిలో?
ఊరు దూరం,
నేనేమో ఒంటరిదాన్ని...
@దీవి.సుబ్బారావు

ఇప్పపూవులొక్కటేమి? నాయొడలిపై
చీరగొన్నగాని, చిన్నవాడా!
ఎవరితోడ మొఱ్ఱలిదుడు నీ యడవిలో
నూరు దవ్వు ; నేను నొంటిదాన !
@రాళ్లపల్లి ఆనంతకృష్ణశర్మ.

The above verse is a simple and rustic conversation between a beautiful village girl and a traveller.
When we read it we can understand as “Oh! traveller if you abduct not only my flowers but also my saree, what I can do? The village is far sway and I am single.” We can understand the story like below.

A young countryside woman used to go to the forest to collect Madhuca longifolia flowers. As usual on that day she went to the forest to collect flowers. While she was returning back to home, she met a handsome young man. She fancied him. He also fancied her. Both knew that thing, but no one stepped forward. Then the girl said the poem as an initiative. The meaning of the verse is “don’t abduct my flowers as well as my saree. If you do so what I can do? The village is far away and I am single. But its sound is different from its meaning. It sounds as ” The village is far away and I am single, you can abduct my flowers, my saree as well as me also.” Its meaning is It’s a wonderful time and place to make romance.

The above verse is collected by a Sanskrit scholar A.Weber from ancient telugu poetics


Dried madhuca longifolia flowers

ఇప్పపూవుల రాతిరి ఏరుకొరకు
ఏగ ననుమతింపడు పతి ఈర్ష్యకతన
పత్ని నేకాకి నింటను వదిలిపెట్టి
వెడలు తానే పూలకు వెర్రి వెంగలప్ప.
@కోడూరు.ప్రభాకరరెడ్డి

ఇప్పపూలు రాత్రిళ్ళు ఏరటానికి
భార్యను పంపడు అనుమానం మొగుడు
తనే పోయి తెస్తానంటాడు
ఆమెను ఒంటరిగా ఇంట్లో వదలి
వెర్రి వెంగలప్ప.
@దీవి.సుబ్బారావు

It’s a simple conversation between a male lover and his messenger (lady).
She told him that ” Your girlfriend’s husband is doubtful about his wife, and that’s why he went to collect the madhuca longifolia flowers instead of his wife. What a fool he is! Actual story is like below.

A housewife used to meet her lover at an arbour beside Madhuca longifolia tree in the name of collecting flowers. Unfortunately, her husband got the information about this illegal relationship and he doubted her. From the next night he left his wife at home alone and went to the forest to collect the flowers. His wife wanted to meet her lover at home and so she sent her messenger to her boyfriend. Then the girl messenger conveyed the information in a beautiful verse to her boyfriend as above in the verse.


These verses are rustic and romantic. Don’t misunderstand me, it is just for fun. That’s all for today. shortly, I will be back with a new blog.

#@Stay home, stay safe.

Infatuation and attraction.

Good morning friends. Praise the Lord for giving us another lovely day. Continue your strives to fight with Covid-19 pandemic. I hope the God will show right ending to this plague. And my only request to all my friends is to follow the instructions given by the government during this pandemic period. Whenever you go outside please wear a mask, maintain social distancing and sanitize your hands regularly.

Today I am going to present another lovely verse from the book Gadha Saptasathi. I hope you will enjoy the content on my blog, And my humble request is to send me your feedback without fail.


1.Prakrit root
భిచ్ఛాఅరో పేచ్ఛఇ ణాహిమండలం
సావి తస్స ముహఅందమ్ /
తచ్చటుకం చ కరంకం దోహ్ణ
వి కాఆ విలుంపంతి//

@ ససిరాఅస్స
2.Sanskrit root.
భిక్షాచరః ప్రేక్షతే నాభిమండలం
సాపి తస్య ముఖచంద్రమ్ /
తచ్చటుకం చ కరంకం ద్వయోరపి
కాకా విలుంపంతి //

@ ససిరాగస్య
3.Telgu translations.
1.కొమ్మ నాభిస్థలాన భిక్షుకుని చూపు
భిక్షు ముఖచంద్రునే నీలవేణి చూపు
చెలువ గరిటెను, యాచకు చిప్పలోని
మెతుకులన్నియు కాకులు మెక్కిపోయే
@సరసిరాయుడు
@ డా.కోడూరు.ప్రభాకరరెడ్డి
2.తిరిపగాడు నాభి దేరి చూచుచునుండ
నదియు వానిమోము నరయచుండె
దానిచేత గరిటే వానిచేతుల చిప్ప
గాకులొడిసి ఏఱి గతుకజొచ్చె
@సరసిరాయుడు
@రాళ్లపల్లి.అనంతకృష్ణశర్మ
3.బిచ్చగాడు ఆమె బొడ్డువంక
ఆమె వాడి ముఖం వంక
కన్నులప్పగించి చూస్తూ ఉండగా
కాకులొచ్చి చిప్పలోను
ఆమె గిన్నెలోను ఉన్నదంతా
ఎగరేసుకుపోయాయి.
@సరసిరాయుడు
@దీవి.సుబ్బారావు
**************************

4. English translation
The Begger casts his glance at the deep navel of the woman, In turn the woman looked at the moon-like face of the beggar. Mean While the crows ate away the alms in the begging bowl and the spoon.

Actual story is like below, read it.


It’s a rustic conversation between an aunt and an elder daughter-in-law. There are some clashes between elder daughter-in-law and younger daughter-in-law for supremacy. Both are the wives of the only son of their aunt. The younger daughter-in-law had lover in the adjacent village.The elder daughter-in-law sensed this information. But she kept it as a secret in her mind. And so the younger daughter-in-law reduced her habit to meet her lover secretly.

But younger daughter-in-law’s lover could not stay without seeing his girlfriend. So he decided to see his girlfriend in a disguise, And he masked as a begger. He went to his girlfriend’s village in the begger’s disguise and stood before her house and shouted for alms. Then the younger daughter-in-law came out to give the alms to the beggar.

The the younger daughter-in-law found some similarities of her lover’s face in the begger’s face. At the same time the begger casted his glance at her tiny, deep navel. She looked at her lover’s moon-like face. Both forgotten the external world and began to floating in their imaginary world. Meanwhile the crows came and ate awy all the food in the begging bowl and the spoon.

Here I would like to quote a telugu saying.

ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు, వలపు సిగ్గెరగదు.

తెలుగు సామెత…

The appetite does not know the taste, the sleep does not know the pleasure, the love does not know the shyness.

As above mentioned verse, both lovers began to imagine their previous lovely memories. They have forgotten the extenal world around them.

Meanwhile the aunt enquired her elder daughter-in-law about younger daughter-in-law. Then the elder daughter-in-law expressed her envy against her sister as above in the verse.

That’s all for today my dear friends. I will meet you with another blog.  Have a nice day…